No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలుముగిసిన కేటీఆర్‌ విచారణ..

ముగిసిన కేటీఆర్‌ విచారణ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు ఆయన్ను 8 గంటలపాటు ప్రశ్నించారు. కేటీఆర్‌ సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇవాళ విచారణకు సెల్‌ఫోన్‌ తీసుకురాలేదని కేటీఆర్‌ చెప్పారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు కేటీఆర్‌ వెళ్లారు . ఆరు గంటల  విచారణలో ఆయనను  అధికారులు 60కిపైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అందుతోంది.  ఈ విచారణలో ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి అధికారులు కేటీఆర్‌ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో   కేటీఆర్ ను ఏసీబీ అధికారులు  గతంలో ఒకసారి ప్రశ్నించారు.  ఇది రెండో సారి.  ఎఫ్​ఈవో కంపెనీ ప్రతినిథుల స్టేట్​ మెంట్​ ప్రకారం.. దర్యాప్తు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం లేకుండా  హెచ్​ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారన్న అంశాలపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏసీబీ ప్రశ్నలకు బదులిస్తూ హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవోకు పంపామని ఇందులో తాను ఎక్కడా లబ్ది పొందలేదని కేటీఆర్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ల వ్యవహారం  అధికారులే చూసుకున్నారని, స్పాన్సర్లు వెనక్కి తగ్గడంతో హెచ్ఎండీఏ నిధులతో ఫీజులు చెల్లించామని చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad