- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన పెంబర్తి నుంచి భ్రమరాంబ కన్వెన్షన్ హాలు వరకు బైక్ ర్యాలీగా చేరుకుంటారు.మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల అభినందన, సన్మాన సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం పార్టీ శ్రేణులు పాల్గొనే ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
అయితే, కవిత శాసనమండలిలో బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డిన నేపథ్యంలో నేడు కేటీఆర్ ఎలా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది.
- Advertisement -



