నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా భువనగిరి జిల్లా శాఖ అధ్యక్షుడిగా భువనగిరి పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకుడు కుకటపు చంద్రశేఖర్ గుప్తాను నియమించి హైదరాబాదులోని జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు కటకం శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ సామ శ్రీధర్, తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రెటరీ ఉత్తమ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రము, ఐడి కార్డు అందజేశారు. ఆయనతోపాటుగా భువనగిరి జిల్లా జనరల్ సెక్రెటరీగా బిజ్జాల శ్రీనివాస్ కూడా నియామక పత్రము అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన భువనగిరి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేను ఎల్లవేళలా సంస్థకు చెడు పేరు రాకుండా మంచి మార్గంలో పనిచేస్తానని అదే కాకుండా ప్రజాసేవకు అంకితమై తన వంతు కృషిచేసి ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా అక్కడ మేము ఉంటామని భువనగిరి జిల్లాలో ఐ హెచ్ ఆర్ సి ఐ సంస్థకు మేలు చేస్తానని నా నియామకానికి సహకరించిన ఐ హెచ్ ఆర్ సి ఐ అగ్ర నాయకులు కటకం శ్రీనివాస్, కల్వ వీరేందర్, సరాఫ్ రజనీష్ , సరాఫ్ తులసి గుప్తా, వాడకట్టు శ్రీకాంత్ గుప్తా, అయిత భాస్కర్, సామ శ్రీధర్, ఐహెచ్ఆర్సిఐ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఐ.హెచ్.ఆర్.సి.ఐ కి సంబంధించిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఐహెచ్ఆర్సిఐ భువనగిరి జిల్లా శాఖ అధ్యక్షుడిగా కుకటపు చంద్రశేఖర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


