నవతెలంగాణ – మల్హర్ రావు
ఇన్నోవేటివ్ గా మంచి విశేష సేవలందించిన వారికి ప్రతి ఏటా జటాధార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జెట్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ ప్రధానం చేస్తుంది. ఇందులో భాగంగా 2025 సంవత్సరంలో ఈ అవార్డుకు 300 వరకు అప్లై చేసుకోగా అందులో 50 మంది ఇన్నోవేటివ్ టీచర్స్ ను ఎంపిక చేసింది. ఇందులో మండల కేంద్రమైన తాడిచర్ల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వనపర్తి కుమారస్వామి, స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్), భూపాలపల్లి మండలంలోని గొల్ల బుద్ధారం డి.యన్.టి.ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న జయ, ఎస్జిటిలు ఎంపికైయ్యారు. సోమవారం హైదరాబాద్ సికింద్రాబాద్ లోని హరిహర కళాక్షేత్రంలో జరిగే అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొని అవార్డ్ తీసుకునే శుభ సందర్భంలో మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు తోపాటు పలువురు వీరికి అభినందనలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి జెట్ ఇన్నోవేషన్ అవార్డ్ లకు కుమారస్వామి, జయలు ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES