Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లను పంపిణీ చేసిన కుమారి అద్విక

పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లను పంపిణీ చేసిన కుమారి అద్విక

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని గూపాన్ పల్లి గ్రామంలో కుమారి అద్విక పుట్టినరోజు సందర్భంగా 60 హెల్మెట్లను గ్రామ ప్రజలకు కుమారి ఆద్విక కుటుంబ సభ్యులు సామాజిక సేవలో భాగంగా పంపిణీ చేశారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన అద్విక వారి కుటుంబ సభ్యులను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య బుధవారం అద్విక వారి కుటుంబ సభ్యులను జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిచి వారు చేపట్టిన మంచి కార్యక్రమాన్ని అభినందించి శాలువతో సన్మానించినారు.

అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా పుట్టినరోజు సందర్భంగా చేపట్టినటువంటి హెల్మెట్ల కార్యక్రమాన్ని అభినందించి, అలాగే మిగతావారు కూడా అద్విక తండ్రి అయినటువంటి బెన్ని  చేపట్టిన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపినారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన దారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అదేవిధంగా వాహనదారులందరూ రోడ్డు నియమాలు పాటించి ప్రమాద రహిత నిజామాబాద్ గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సి.పి  మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సంతోష్ రెడ్డి, కుమారి అద్విక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad