- Advertisement -
నవతెలంగాణ – పిట్లం
కుమ్మరి కులం నుండి సర్పంచి వార్డ్ మెంబర్లుగా ఎన్నికైన వారిని ఆదివారం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కొమ్మల సంఘం నాయకులు సన్మానించారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, వార్డు సభ్యులు సునీత జితేందర్, అనసూయ సాయిరాం లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కుమర్ల సంఘం అధ్యక్షులు చందూర్ బాబు, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సాయిలు, పిట్లం మాజీ జెడ్పిటిసి కుమ్మరి రాములు, మాజీ ఎంపిటిసి పోరం మండల అధ్యక్షులు డా, కుమ్మరి నారాయణ, బారాంగ్ హెడ్గి మాజీ ఎంపిటిసి గంగాధర్, పిట్లం సంఘం నాయకులు సంగయ్య, పండరి, ఆనంద్, శంకర్ లు ఘనంగా సన్మానించారు.
- Advertisement -



