నవతెలంగాణ – కట్టంగూర్
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటుచేసిన అమ్మవారి మండపం ప్రాంగణంలో ఆదివారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత ఏడు రోజులుగా అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రెడ్డిపల్లి మనోహర్, కోమటి భాస్కర్, రుద్రాభట్ల జితేందర్ శర్మ, రెడ్డిపల్లి వీరాస్వామి, బండారు అరుణ్ గుప్త, కొల్లూరి శివప్రసాద్, రెడ్డిపల్లి సైదులు, కాపు గంటి గోపి, కాపుగంటి నరేష్, కొంపెల్లి సైదులు,చెరుకు వెంకన్న, కట్టంగూరు శివ,చెరుకు రాము, చెరుకు శ్రీను, గౌరీ, కోమటి భానుతేజ,శివ,హరీష్, మధు, వేణు, కార్తీక్,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES