- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల కేంద్రమైన చిన్నకోడూరులోని జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఐదవ రోజు సందర్భంగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిళలు పసుపు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు మాట్లాడుతూ .. అమ్మవారికి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారి కృప కటాక్షాలు పాడిపంటలు, పిల్లలు, గ్రామ ప్రజలందరు చల్లగా చూడాలని వేడుకున్నారు. అమ్మ వారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల అలంకరణ భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగాలని భక్తులు కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -