Tuesday, February 24, 2026
E-PAPER
Homeకరీంనగర్రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు కుమ్మరిపల్లి ఉపాధ్యాయుడు

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు కుమ్మరిపల్లి ఉపాధ్యాయుడు

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు మండలంలోని కుమ్మరి పల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ ఎంపికయ్యారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు రూపొందించిన ఆయన పరిశోధన పత్రం “సృజనాత్మక బోధన” రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ తెలిపారు.

ఫిబ్రవరి 28న హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో నిర్వహించనున్న సదస్సులో అభయ్ రాజ్ తన ప్రదర్శనను వివరించనున్నారు. ఈ సందర్భంగా అభయ్ రాజ్‌ను జిల్లా విద్యాధికారి రాము, మండల విద్యాధికారి రాఘవులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవలక్ష్మి, గ్రామ సర్పంచ్ గుమ్మడి సంతోష్, ఉప సర్పంచ్ కొడిమ్యాల శేఖర్ తదితరులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -