Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుమ్మెర బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలి

కుమ్మెర బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలి

- Advertisement -

డీజీపీకి బీసీ కమిషన్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామ బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ వెనుక బడిన తరగతుల కమిషన్‌ చైర్మెన్‌ జి నిరంజన్‌ శనివారం డీజీపీ బి శివధర్‌రెడ్డికి లేఖ రాశారు. చనిపోయిన రెండు నెల్ల పాప తల్లి మౌనిక బాలిం తగా ఉన్నందున ఆమెకు విశ్రాంతి అవసర మని పేర్కొన్నారు. మెడికల్‌ చెకప్‌కు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఆ పాపను పూడ్చిన సమాధి కి ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చనిపోయిన పాప తండ్రి గణేష్‌ తల్లి మౌనిక నాయనమ్మ చంద్ర కళతో జిల్లా కలెక్టర్‌ ఆఫీసులో కమిషన్‌ సుమారు 45 నిమిషాలు మాట్లాడి వారి వివరాలను తెలుసు కున్నామని తెలిపారు. అనేక బీసీ సంఘాలు తమకు విజ్ఞాపనలు అందించిన నేపథ్యంలో ఈ లేఖ రాసినట్టు కమిషన్‌ చైర్మెన్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -