అధ్యక్షులుగా సభావాత్ బికోజి..
నవతెలంగాణ – తుంగతుర్తి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల సర్పంచుల ఫోరం గౌరవ అధ్యక్షులుగా(అన్నారం గ్రామ సర్పంచ్)కుంచాల శ్రీనివాస్ రెడ్డి,అధ్యక్షులుగా (బాపన్ భాయ్ తండ సర్పంచ్) సభావాత్ బికోజి లను ఏకగ్రీవంగా అన్ని గ్రామాల సర్పంచ్ లు ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో మండల సర్పంచ్ ల ఫోరం బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని,ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామాల అభివృద్దికి వినియోగించేవిధంగా కృషి చేస్తామని తెలిపారు.
సర్పంచ్లకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడతామని హామీ ఇచ్చారు.మండల సర్పంచ్ల ఫోరం బాధ్యతలను అప్పగించడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.సర్పంచుల హక్కులకై,సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.ఉపాధ్యక్షులుగా(సంగెం సర్పంచ్ )కలకోట్ల మల్లేష్,కార్యదర్శిగా(తుంగతుర్తి సర్పంచ్)మల్లెపాక సాయిబాబా,ప్రధాన కార్యదర్శిగా( కరివిరాల సర్పంచ్)మోర సంధ్య బిక్షం,కోశాధికారిగా(ఏనేకుంట సర్పంచ్) బానోతు రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



