- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూష రెడ్డి సజీవ దహనమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె దీపావళి పండుగకు సొంతూరు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి ధాత్రి కూడా మృతి చెందింది. అనూష మరణంతో ఆమె స్వగ్రామం వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



