Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజోలిలో కెవిపిఎస్ నాయకులు ముఖ్య సమావేశం

రాజోలిలో కెవిపిఎస్ నాయకులు ముఖ్య సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండల కేంద్రంలోని కెవిపిఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు రావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కెవిపిఎస్ సంఘం ఈ మండలంలో అనేక పోరాటాలు చేసిందని గతంలో హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉంటే వాటి గురించి పోరాటం చేసిందని అలాగే ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్యలు మానభంగాలు జరిగితే ముందు ఉండి పోరాటం చేస్తుందని అన్నారు. ఈనెల 26 తేదీన రాజ్యాంగ దినోత్సవం మరియు 28 మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఉందని కెవిపిఎస్ కార్యకర్తలు ఘనంగా జరపాలని అన్నారు. కెవిపిఎస్ మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ ఈ మండలంలోని దళిత కాలనీలో మురికి కలలు డ్రైనేజీలు రోడ్లపై చెత్త చెదారము ముళ్ళకంపలు తొలగింపునకు మరియు హాస్టల్లో సర్వేలు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు వాటి గురించి అనేక పోరాటాలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -