Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేవీపీ పిటిషన్‌కు విచారణార్హత లేదు : సీబీఐ

కేవీపీ పిటిషన్‌కు విచారణార్హత లేదు : సీబీఐ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
టైటానియం లీజుల వ్యవహారంలో ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసును సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడైన కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించే పరిధి లేదని సీబీఐ హైకోర్టులో వాదించింది. ఈ వ్యవహారంపై వాదనలు విన్న జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ఆ నోటీసు ఇంటర్‌పోల్‌ సంస్థ జారీ చేసిందనీ, అభ్యంతరాలుంటే పారిస్‌లోని ఇంటర్‌పోల్‌లోనే అప్పీల్‌ చేసుకోవాలని సీబీఐ పేర్కొంది. పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని కేవీపీ న్యాయవాది తన వాదన వినిపించారు. దీనిపై వాదనలు రెండు వారాల తర్వాత జరుగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -