– దానిలో భాగమే 10 గంటల పని జీవో
– కార్పొరేట్లకు లాభాపేక్షే పరమావధి
– కార్మిక వర్గానికి ఇదో సవాల్
– 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : ఎస్వీకే వెబినార్‌లో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లు కార్మిక వర్గానికి మరణ శాసనం రాస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘జూలై 9న సార్వత్రిక సమ్మె ఎందుకు?’ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌ల పర్యవసానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలో పది గంటల పని విధా నాన్ని అమలు చేస్తూ జీవోలు విడుదల చేశారని గుర్తు చేశారు. అదే జీవోలో 12గంటల వరకు పనిచేయించ వచ్చని పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికే అదనపు గంటలు పని చేయించుకుంటున్న యజమా న్యాలు దీన్ని మరో అవకాశంగా తీసుకుంటారని చెప్పారు. సమ్మెకు మూడు రోజుల ముందు ఇలాంటి జీవోను విడుదల చేయటమంటే.. పుండుమీద కారం చల్లటమే నని విమర్శించారు. భారత కార్మిక వర్గానికి ఇదొక సవాల్ అని అన్నారు. కార్మిక సంఘాల నాయకత్వాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్జిజన్‌లు పాల్గొనకుండా, కట్టడి చేసేందుకు వారి రోజువారి హాజరు పట్టికను ఉన్నతాధి కారులకు చూపించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే..ఇక ప్రయివేటు రంగంలో ఎలా ఉంటుందో ఊహించుకోవ చ్చన్నారు. పాలక వర్గాల బరితెగింపుతో కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెకు ప్రాధాన్యత పెరిగిందని వివరించా రు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, విదేశీ పెట్టుబడి దారులను సంతృప్తి పరిచేందుకే ప్రధాని మోడీ నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చారని స్పష్టం చేశారు. కార్మిక శ్రేయస్సు కోసమే కోడ్‌లు తెచ్చామని మోడీ చెప్పే మాటల్ని దేశ కార్మికవర్గం ఏమాత్రం విశ్వసించబోద న్నారు. పాత చట్టాల్లో అనేక లోపాలున్నప్పటికీ, అవి కొంతైనా లేబర్‌కోడ్‌ల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టినప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలికాయనీ, కేవలం కమ్యూనిస్టులు మాత్రమే వ్యతిరేకించారని గుర్తు చేశారు. పార్టీలు వేరైనా పారిశ్రామిక వేత్తల సేవలో తరించటంలో బూర్జువా నేతల లక్ష్యం ఒకటేనని తేల్చిచెప్పారు. ఘనమైన పోరాట చరిత్ర కలిగిన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మారుస్తున్నారనీ, ఈ విధానాలను కార్మిక వర్గం అంగీకరించబోదని స్పష్టం చేశారు. అనేక పరిశ్రమల్లో వలస కార్మికులతో తక్కువ వేతనాలకు పని చేయిస్తున్నారనీ, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు ఎందుకు పర్యవేక్షణ చేయటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సిగాచి ప్రమాదం జరిగిందన్నారు. పాలకుల విధానాలతో కార్మికులకు కష్టాలు పెరుగుతున్నాయనీ, అదే సమయంలో దేశంలో శత కోటీశ్వరుల సంఖ్య, సంపద పెరుగుతున్నాయని వివరించారు. 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులకు ఎర్రజెండా అండగా ఉన్నదని భరోసా ఇచ్చారు.
లేబర్ కోడ్‌లతో కార్మికులకు మరణశాసనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES