Wednesday, May 21, 2025
Homeప్రధాన వార్తలులేబర్‌కోడ్‌లు రద్దు చేయాల్సిందే

లేబర్‌కోడ్‌లు రద్దు చేయాల్సిందే

- Advertisement -

– ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి
– కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి
– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
– కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన భారీగా తరలొచ్చిన కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాల్సిందేనని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా ప్రభుత్వ రంగ సంస్థ లను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వారు నొక్కి చెప్పారు. మోడీ సర్కారు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధా నాలను వెనక్కి తీసుకోవాలని పట్టు బట్టారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్‌లో విద్యానగర్‌లో గల కేంద్ర కార్మిక శాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేప ట్టారు. అనంతరం రీజినల్‌ సెంట్రల్‌ లేబర్‌ (కేంద్ర కార్మిక శాఖ) డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌కు కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు వినతి పత్రం అందజేశారు.
నిరసనను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాద ఘాతుకం అనంతరం దేశంలోని పరిస్థితు లను పరిగణనలోకి తీసుకున్న జాతీయ కార్మిక సంఘాలు జాతీయ సమ్మెను 2025 జులైౖ 9కి వాయిదా వేశాయని తెలిపారు. 11 ఏండ్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానా లను, కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేస్తున్న తీరును ఎండగట్టారు. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించు కున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను ముందుకు తెచ్చిం దని ఎత్తిచూపారు. లేబర్‌కోడ్‌లకు వ్యతిరే కంగా సంఘాలకు అతీతంగా కార్మికులం దరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపుని చ్చారు. జులై 9 వరకు ఈ నిరసనలను కొనసాగించాలని కోరారు.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాల్‌రాజ్‌ మాట్లాడుతూ 2025-26 బడ్జెట్‌లో కేంద్రం కార్పొరేట్లకు అనుకూలం గా కేటాయింపులు చేసిందనీ, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని విమ ర్శించారు. సామాన్యులపై భారాలు మోపి, కార్పొరేట్‌ గుత్త సంస్థలకు, పెట్టుబడిదా రులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిన తీరును ఎండగట్టారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్య లను పట్టించుకోకపోగా ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే ఆర్ధిక విధానాలను విచక్షణారహితంగా అమలు చేస్తున్నదని విమర్శించారు.
ఐఎన్‌టీయూసీ సీనియర్‌ ఉపాధ్య క్షులు జనక్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు లను రక్షించుకొనేందుకు కార్మికవర్గం పోరా టానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీయూసీఐ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ అనుసరి స్తున్న విధానాల వల్ల దేశంలో ఐదు శాత మున్న పెట్టుబడిదారుల వద్ద 70 శాతం సంపద పోగుపడిందనీ, 50 శాతం ప్రజల చేతుల్లో కేవలం మూడు శాతం సంపదే ఉందని చెప్పారు. రోజుకు రూ.178 జీతం ఉంటే చాలని పాలకులు నిర్ణయించడం దారుణమన్నారు. బతకడానికి రోజుకు రూ.178 చాలన్న పాలకులకు లక్షల రూపాయల జీతాలెందుకని ప్రశ్నించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ..దేశంలో పేదరికం 17 శాతానికి పెరిగిందనీ, నిత్యావసర సరుకుల ధరలు కార్మిక, పేద ప్రజల జీవితాలను కష్టాలపాలు చేస్తున్నాయని వాపోయారు. మోడీ సర్కార్‌ విధానాలను కార్మికవర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనకు సంఘీభావం తెలుపుతూ ఎస్‌కేఎం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్‌, పశ్యపద్మ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌ నాయక్‌ మాట్లాడుతూ…ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను మోడీ సర్కార్‌ విస్మరించిందని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు కలిసి పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ నిరసనలో సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు జె.వెంకటేశ్‌, వీఎస్‌.రావు, కె.ఈశ్వర్‌రావు, పి.శ్రీకాంత్‌, కూరపాటి రమేశ్‌, రాష్ట్ర నాయకులు పి.సుధాకర్‌, ఎ.సునీత, కుమారస్వామి, రాజుభట్‌, నగర నాయకులు అజరుబాబు, రాములు, శ్రీనివాస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేంపావని, కార్యదర్శి బి.వెంకటేశ్‌, నాయకులు కమతం యాదగిరి, బొడ్డుపల్లి కిషన్‌, టీయూసీఐ రాష్ట్ర నాయకులు ఎస్‌ఎల్‌.పద్మ, ఐఎఫ్‌టీయూ నాయకులు అనురాధ, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శులు ఆర్‌డీ.చంద్రశేఖర్‌, భాస్కర్‌రెడ్డి, ఆదిల్‌ షరీఫ్‌, ఉపాధ్యక్షులు విజరుకుమార్‌ యాదవ్‌, జగన్మోహన్‌రెడ్డి, అబ్రహం, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు ఎల్‌డి.పాల్‌, మల్లేశ్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -