– కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
– మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ మహబూబాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకో వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపుని చ్చారు. ఆదివారం మహబూబా బాద్ సీఐటీయూ జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, కాసు మాధవి, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములుతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. స్వాతం త్య్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చిందన్నారు. 8 గంటలు పనిదినాన్ని 12 గంటలకు పెంచిం దని, యూనియన్లు ఏర్పాటు చేసుకోకుండా, కార్మికుల సమ్మె హక్కును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. కార్మికుల కనీస వేతనాలపై, స్కీం వర్కర్స్ సమస్యలపై, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ఏనాడూ పట్టించుకోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు మాత్రం రూ.16.35 లక్షల కోట్లను మాఫీ చేసిందన్నారు. సామాజిక సంక్షే మానికి కోతలు పెట్టి సామాన్యు లపై భారాలు మోపి కార్పొరేట్, బడా సంస్థలకు రాయితీలు ప్రకటిస్తున్నదని విమర్శించారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్య లను కూడా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తిగా ఉన్న రైల్వే, రోడ్లు, ఎయిర్ వేస్, పోర్టులు, టెలికాం తదితర మౌలిక రంగాల్లో నేషనల్ మాని టైజేషన్ పైప్‌లైన్ పేరిట కార్పొ రేట్లకు కట్టబెడుతోందని, దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, కూలీలు, కార్మికులు కలిసి గ్రామీణ బంధు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయని, కార్మిక హక్కుల కోసం జరిగే ఈ సమ్మెలో గ్రామీణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశం లో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES