- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. రైతు సంఘం , సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక , రైతు వ్యతిరేక చట్టాల పైన చేపట్టిన జీపు జాత ఆదివారం కాటారం గ్రామానికి చేరుకుంది. లేబర్ కోడ్ తో కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చకుండా యథాతతంగా కొనసాగించాలన్నారు. అదేవిధంగా కార్పొరేట్ విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు , కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రాజేందర్ పాల్గొన్నారు.
- Advertisement -



