Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. 

లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు స్వరూప, రేణుక, మంజుల డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మె లో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలోని 70 కోట్లకు పైగా ఉన్న కార్మికవర్గానికి ప్రయోజనం చేకూర్చే 44 కార్మిక చట్టాలోని 29 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌ లుగా మార్చి కార్మికులను అటు యాజమాన్యాలకు, ఇటు ప్రభుత్వాలకు కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడం గర్హనీయమన్నారు. అసంఘ టిత రంగంలోని కార్మికుల సంక్షేమ కోసం ఉద్దేశించిన 1996 వేల్ఫేర్‌ బోర్డు చట్టాన్ని కూడా మార్పు చేయడం ద్వారా కార్మికులకు అందే సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడం శోఛనీయమన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్న పేద, మధ్య తరగతి వర్గీయులు, కార్మికుల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ తీవ్రతను అరికట్టడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్టేందుకు సిద్ధం కావడం దౌర్భాగ్యమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కార్మిక సంఘాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సత్తయ్య, ఎల్లమ్మ, యాకమ్మ, ధూమ నాయక్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -