– సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి
– సార్వత్రిక సమ్మె సందర్భంగా రామాయంపేటలో బారీ ర్యాలీ
నవతెలంగాణ-రామాయంపేట
కార్మికుల పొట్టగొట్టే లేబర్ కోడ్స్ వెంటనే రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె సందర్భంగా, మెదక్ జిల్లా రామాయంపేటలో కార్మిక సంఘాలు బుధవారం మహాంకాళి దేవాలయం నుండి ర్యాలీగా బయలుదేరి, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి, అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు దిగ్బంధం చేపట్టారు. ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 282, కార్మికుల పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతుందని, ఇది కార్మికులపై తీవ్ర భారం మోపుతుందని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రసూతి, వివాహ సహాయం, ప్రమాద బీమా, పెన్షన్, రుణాలు వంటి ప్రయోజనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులకు తగినన్ని పని దినాలు లభించడం లేదని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎఐటియుసి బీడీ సంఘం రాష్ట్ర కోశాధికారి అయ్యవారి లక్మన్, బీడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్ప, సీఐటీయూ నాయకుడు గౌతం, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్మికుల పొట్టగొట్టే లేబర్ కోడ్స్ రద్దు చేయాల్సిందే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES