Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక చట్టాలకు తూట్లు

కార్మిక చట్టాలకు తూట్లు

- Advertisement -

మానవ హక్కుల వేదిక (HRF) జిల్లా కార్యదర్శి, న్యాయవాది జి రమేష్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లుల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుంది అని, ఉన్న చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు అని అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) నిజామాబాద్ 7వ నగర మహాసభ నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో శనివారం నిర్వహించారు. మహాసభ ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కొంతమంది పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా మార్చుతున్నారన్నారు. 12 గంటల పని సమయాన్ని పెంచి శ్రామికవర్గ దోపిడీకి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 

మరో వక్త సిపిఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోవాలని అన్నారు. కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయాలు చేస్తూ ఎంపీ , ఎమ్మెల్యే లుగా గెలుస్తున్నారని ప్రజలను మాత్రం బిచ్చగాల్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. POW జిల్లా కార్యదర్శి భారతి, IFTU జిల్లా సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో IFTU నగర మాజీ అధ్యక్షులు ఎల్ బి రవి, నగర కార్యదర్శి ఎం శివ కుమార్, మల్లిఖార్జున్, ఎం. మోహన్, నర్సింగ్ రావు, అబ్దుల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -