టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం
ఐక్యతను చాటాలని పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఈనెల 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపునకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ సంఘీభావం ప్రకటించింది. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ సమ్మెలో జర్నలిస్టులంతా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖలు 9న అన్ని జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లో కేంద్ర కార్మిక సంఘాలతో పాటు జరిగే ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించే ధర్నాలు, ప్రదర్శనలు ఇతర ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాలని సూచించింది. జర్నలిస్టులకు ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వత్తి ప్రమాణాలను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా నిరసన తెలపాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కార్మిక సంఘాల సమ్మెకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES