Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవడదెబ్బతో కూలీ మృతి

వడదెబ్బతో కూలీ మృతి

- Advertisement -

నవతెలంగాణ-నార్నూర్‌
ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కూలీ కల్వాలె విజయ్‌(38) శనివారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌ కూలీ పని నిమిత్తం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో వారం రోజుల కింద పత్తి సీజన్‌ ఉండటంతో బండి నింపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి రెండు రోజుల కింద రిమ్స్‌లో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ రాథోడ్‌ దిలీప్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆదివారం కూలీ కుటుంబానికి భరోసానిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -