ప్రభుత్వ భవనాలకు ప్రభుత్వ భూములు కరువు
కబ్జాలకు గురి అవుతున్న ప్రభుత్వ భూములు
హద్దులు, గీసి బోర్డు ఏర్పాటు చేయని రెవిన్యూ శాఖ
నవతెలంగాణ – కాటారం
ప్రభుత్వ భావనలు కట్టాలి అంటే కాటారం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు కరువు అవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడవలసిన రెవిన్యూ వ్యవస్థ బడా లేడర్లకు కొమ్ము కాస్తున్నారు. కాటారం మండల కేంద్రం లో (గారేపల్లి శివారు ) గల భూములు చాల విలువ కలవి. పైగా కాటారం దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కనుక కబ్జా దారుల కండ్లు మొత్తం ఆ భూముల పైనే ఉంటుంది. కాటారం కేంద్రంలో (గారేపల్లి శివారు) చెరువు శిఖం మొత్తం కబ్జా కోరల్లోనే ఉంది. ఇంత జరుగుతున్నా.. రెవిన్యూ వ్యవస్థ మాత్రం మొద్దు నిద్ర పోతుంది. ఇలానే జరిగితే రాబోవు కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి అంటే ప్రభుత్వ భూమి మాత్రం కష్టమే అని మేధావి వర్గంలో గుసగుసలు వినపడుతున్నాయి. అస్సలు రెవిన్యూ వ్యవస్థ ముఖ్యమైన పని ” ప్రభుత్వ భూముల పరిరక్షణ” భాద్యత కానీ వారు మాత్రం కబ్జా దారులకు తెరవెనుక సాయం అందిస్తున్నారు. అని ప్రజలు, మేధావి వర్గం విమర్శలు చేస్తున్నారు. ఇక నైన రెవిన్యూ వ్యవస్థ మేల్కొని ప్రభుత్వ భూములకు హద్దులు పెట్టి, బండరిస్ చేసి బోర్డు ఏర్పటు చేయాలని స్తానిక ప్రజలు, మేధావి వర్గం రెవిన్యూ వ్యవస్తకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ భూములకు రక్షణ కరువు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES