Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్షట్టర్ల వేలానికి స్పందన కరువు ..

షట్టర్ల వేలానికి స్పందన కరువు ..

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక  : మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే కమర్షియల్ షట్టర్ల వేలానికి వ్యాపారస్తుల నుంచి స్పందన కరువైంది. స్పెషల్ ఆఫీసర్,అడిషనల్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు గురువారం దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 11 కమర్షియల్ షట్టర్ల కు వేలం ప్రక్రియ నిర్వహించారు. పోచమ్మ గుడి వద్ద గల 2 షట్టర్లకు గాను షాప్ నెంబర్ 4 ను మాత్రమే వేలం పాట ద్వారా డీ.కృష్ణవేణి దక్కించుకున్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహం వద్ద నున్న మున్సిపల్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లోని 6 షట్టర్లు, 2 బీహెచ్ కే సముదాయం వద్దనున్న నాలుగు షట్టర్లకు ఎలాంటి దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. ఈ వేలం ప్రక్రియలో ఏఈ శ్రీకాంత్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, జ్యోతి పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -