నవతెలంగాణ-చిన్నకోడూరు
మండల కేంద్రమైన చిన్నకోడూరులో చాలా రోజులుగా మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. దీంతో దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజులుగా కాలువలను శుభ్రం చేయకపోవడంతో రాత్రిపూట దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే పంచాయితీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. పైపులైను పగిలిపోయి 15 రోజులు కావస్తున్నా పార్టీ నీరు రోడ్డుపై వెళ్లడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద హోటల్ నుండి నీరు బయటకు రావడంతో రోడ్డుపై నీరు నిలవడంతో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చిన్నకోడూరులో లోపించిన పారిశుద్ధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



