ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
ఎన్‌ఎస్ లక్ష్మీదేవమ్మ ప్రథమ వర్ధంతి సభ
నవతెలంగాణ – ముషీరాబాద్
మహిళల సమాన హక్కుల కోసం లక్ష్మీదేవమ్మ అలుపెరగక పోరాడారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. శనివారం ఎన్‌ఎస్ లక్ష్మీదేవమ్మ మొదటి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లిం గంపల్లిలోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో సభ నిర్వహిం చారు. ముందుగా లక్ష్మీ దేవమ్మ చిత్రపటానికి ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కేఎన్ ఆశాలత, సీనియర్ నాయకులు ఎం.లక్ష్మమ్మ పూలమాలవేసి నివాళి అర్పిం చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడారు. లక్ష్మీదేవమ్మ తన జీవితకాలమంతా మహిళా హక్కుల కోసమే పని చేశారని, ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా, మహిళా సంఘం నిర్మాతగా ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. వ్యవసాయ కూలీల వేతనాల పెంపు కోసం, ఇండ్ల స్థలాల కోసం చేసిన పోరాటాల్లోనూ ఆమె కృషి చేశారని అన్నారు.
ముఖ్యంగా 498 చట్టం సాధనలో ముఖ్య భూమిక పోషించారని, సమాన హక్కులు కావాలని జరిగిన పోరాటంలో మహిళల ందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు చేశారని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కుటుంబ న్యాయ సలహా కేంద్రానికి మొట్ట మొదటి కన్వీనర్‌గా ఉంటూ భార్యాభర్తల సమస్యలను పరిష్కరిం చడంలో, కుటుంబాన్ని సమన్వయం చేసి కలిపి ఉంచడంలో విశేష కృషి చేశారని తెలిపారు. తన ఉద్యమ అనుభవాలను, మహిళలు రోజువారీగా ఎదుర్కొనే అనేక ఆటంకాలను ఏ రకంగా అధిగమించవచ్చో తెలియజేస్తూ అనేక రచనలు చేసి మహిళలను చైతన్యపరిచారన్నారు. తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే తనకు ఇచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, పి. శశికళ, రాష్ట్ర నాయకులు మస్తాన్.బి, ఎల్ కవిత, వి.కవిత తదితరులు పాల్గొన్నారు.