Tuesday, November 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రిటన్‌కు లక్ష్మీ మిట్టల్‌ గుడ్‌బై!

బ్రిటన్‌కు లక్ష్మీ మిట్టల్‌ గుడ్‌బై!

- Advertisement -

లండన్‌ : బ్రిటన్‌లో సంపన్నులపై అక్కడి ప్రభుత్వం పన్నుల భారాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవడంతో అక్కడి ధనవంతులు పన్ను మినహాయింపు దేశాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన దిగ్గజ స్టీల్‌ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌ బ్రిటన్‌ నుంచి తన వ్యాపారాలను షిప్ట్‌ చేసే పనిలో ఉన్నారని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రభుత్వ పన్ను విధానం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడాలని మిట్టల్‌ నిర్ణయించుకున్నట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొంది. ఇకపై పెట్టుబడులన్నీ దుబారులోనే పెట్టే యోచనలో మిట్టల్‌ ఉన్నట్టు వెల్లడించింది. నాన్‌ డోమ్‌ పన్ను విధానాన్ని రద్దు చేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పన్ను విధానం కింద అక్కడి నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 226 సంవత్సరాల నుంచి ఈ పన్ను వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని తొలగించాలని కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పన్ను చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు సంపన్నులు దేశం వీడుతున్నారు. కాగా.. రాజస్థాన్‌లో జన్మించిన మిట్టల్‌.. బ్రిటన్‌లో 8వ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థలో లక్ష్మీ మిట్టల్‌ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. ఆయన ఆస్తుల విలువ 15.4 బిలియన్‌ పౌండ్లుగా (దాదాపు రూ.1.80 లక్షల కోట్లు) ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -