Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్12,13న లక్ష్మీనరసింహ రథోత్సవాలు..

12,13న లక్ష్మీనరసింహ రథోత్సవాలు..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: ఈనెల 12, 13, రెండు రోజులపాటు నిర్వహించే శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రంగురంగులతో శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 12, 13, రెండు రోజులపాటు రథోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 12న రాత్రి పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీనారాయణ రథాన్ని ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 13న సాయంత్రం రత జాతర రథం ఊరేగింపు ఉంటుంది. ఈ ఉత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ప్రసాదం అందిస్తారు. ఈనెల 13న ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నదానంతో పాటు ఉదయం నుండి భారీ ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈ రథోత్సవ జాతరకు వేలాదిగా భక్తులు పాల్గొననున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -