Sunday, July 27, 2025
E-PAPER
Homeసోపతిసావనం ఎంట లచ్మి రాక

సావనం ఎంట లచ్మి రాక

- Advertisement -

చిన్నమ్మ! ని కొడుకులు నిద్ర లేసిండ్రా లేద తానం గిట్ట జేసిండ్రా? తాయిదాంబలి తాగించి పంపు జెల్దీ సెల్వు దినమే అంటాని ఆలిష్టానికి ఓదలేయొద్దు బాధకీనికి ఆలవాటు పడిందైతే గంతే ముచ్చట, గుర్వారం అమాస ఇండ్లు అన్ని సాప్‌ జేసిండ్రు గదా ఆసడం బోయి సవనం వచ్చే.
నెన్‌ ముందే అందర్కి సెప్పినుంటి ఇండ్లు ఆకిళ్లు చెత్తు వాకిళ్లు అన్ని సుబ్రం సీసుకోవాలంటని గట్లనె సేస్తాం లే పొడుకు పొడుగు ఉంటాం అని గట్లాటి పనులాన్ని మాకే సెప్తారు గద. సెయ్యక తపడదా సేస్తాం తి. సెయ్యకుంటే మా ఇంట్ల సెప్తావ్‌ మల్లి తిట్లు ఎందుకు, రాకి పున్నం ఇంకా శ్యాన దినాలు ఉంది గదా ఎందుకు ఇప్పుడే సేపిస్టుజున్నారు గప్పడిదంక సేస్తాం తి రకి పున్నం ఒకటే కాదు సావనం వస్తే దినాం పండగనే ఎర్కే నా, సుక్రరమ్‌ అంటే లచిమ్‌ అన్నట్టు నీకు లాచ్మి కావలన వద్ద?
నువ్వు ఎం జెయ్యకుండా ఇల్లంత గలీజ్‌ పెట్టుకుంటే ఆ అమ్మోరికి రాబుద్దాయితదా ? ఒక్క ఒక్కరు ఒక్కో పని జేస్కుంటే ఎవ్వరి కి అల్పుండదు .దేవుని పోట్లు తుడ్సి బొట్లు పెట్టి దేవునికద సామాండ్లు తూడ్సి గట్ల నెత్తికొక పని సేస్కుంటా పోతే ఎం కాదు.
గట్ల అన్ని తూడ్సి నాక గప్పుడు లచ్మి ని రమ్మని పిలవలే అమ్మ బెల్లం అన్నం ఓండినాక ఎక్కిస్తే తర్వత కండ్ల హత్తుకొని ఏదేదిగా తింటే గదే సంతోషం గాదె సంతోషమిచేదే లచ్మి.
లచ్మి అంటే మనం గన్ని కొనుకునికే పనికొచ్చే పైసల్‌ నోట్లే గాదు మనసుకు సంతోసం ఇచ్చే దేన్నైనా లచ్మి అంటారు అన్నట్టు,గందుకే ఎన్మిది రకాల లచ్మి లు ఉన్నయ్యాని పెద్దోళ్ళు సేపోయిండ్రు,గాదేంది రా నర్సిమ్మ గా దినం అయ్యగారు సెప్పితుంటే బుక్కుల రాస్కోమని సెప్పింటి గదా గావె అష్ట లచ్చుములు అన్నట్టు,లచ్మి లేకుంటే మనకు బాత్కే లేదన్నట్టు ఇప్పటికి మీకైథె ఇద్య లచ్మి, ధైర్నీ లచ్మి గవ్వటితోనే విజయ లచ్మి గూడా దక్కుతది.
సద్వుకోవాలె గాని పరిచళ్ళల్లా చిట్టింగ్‌ కొట్టొద్దు పైసల కొరకు దొంగతనాలు, లంచల్‌ తినుడు చేస్తే ఎర్రికొడుకుల్ని బేధిరించి తీసుకుంటే లచ్మి తిక్క తీస్తది నీతి అంస్తది కష్టం త అచ్చిన పైసల్‌ తోనే జమాజీస్కొని వాడుకోవాలే ఇజ్జత్‌ తోనా బాత్కాలే ఇజ్జత్‌ కూడా లచ్మె ఎరుకైందా..
– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -