Saturday, November 22, 2025
E-PAPER
Homeఆటలుసెమీస్‌కు లక్ష్యసేన్‌

సెమీస్‌కు లక్ష్యసేన్‌

- Advertisement -

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి లక్ష్యసేన్‌ దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ వరుససెట్లలో భారత్‌కే చెందిన ఆయుష్‌ శెట్టిపై విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను లక్ష్యసేన్‌ 23-21, 21-11తో ముగించాడు. సెమీస్‌లో లక్ష్యసేన్‌ చైనీస్‌ తైపీకి చెందిన టి.సి. ఛౌతో తలపడనున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో వీరు 19-21, 15-21తో మలేషియా జంట చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -