ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్
బర్మింగ్‌హామ్ : ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. 2022లో ఇక్కడ ఫైనల్‌కు చేరుకున్న లక్ష్యసేన్.. మళ్లీ ఈ ఏడాది ఆ స్థాయిలో రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో హాంగ్‌కాంగ్ షట్లర్ లాంగ్ ఆంగస్‌పై 21-19, 21-23, 21-10తో లక్ష్యసేన్ మూడు గేముల మ్యాచ్‌లో పైచేయి సాధఙంచాడు. గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్ నెగ్గి ముందంజ వేసినా.. సూపర్ టైబ్రేకర్‌కు దారితీసిన రెండో గేమ్‌ను హాంగ్‌కాంగ్ ఆటగాడు నెగ్గాడు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో రెచ్చిపోయిన లక్ష్యసేన్ 21-10తో ఏకపక్షంగా గెలుపొందాడు. క్వార్టర్‌ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టోలు 19-21, 8-9తో వెనుకంజలో కొనసాగుతుండగా.. గాయంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆల్‌ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆశలన్నీ ఇప్పుడు లక్ష్యసేన్‌పైనే ఉన్నాయి. నేడు సెమీఫైనల్లో చైనా షట్లర్, ఆరో సీడ్ లీ షి ఫెంగ్‌తో లక్ష్యసేన్ తాడోపేడో తేల్చుకోనున్నాడు.



