ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750
పారిస్ (ఫ్రాన్స్) : ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ షట్లర్ వరల్డ్ నం.29 నాట్ నుయెన్ చేతిలో 7-21, 16-21తో వరుస గేముల్లో లక్ష్యసేన్ చేతులెత్తేశాడు. గత వారం డెన్మార్క్ ఓపెన్‌లో మూడు గేముల మ్యాచ్‌లో ఐర్లాండ్ షట్లర్‌ను ఓడించిన లక్ష్యసేన్.. పారిస్‌లో పేలవంగా ఆడాడు. స్మాష్‌లు గతి తప్పటంతో తొలి గేమ్‌లో 2-7తో వెనుకంజ వేసిన లక్ష్యసేన్ మళ్లీ కోలుకోలేదు. వరల్డ్ నం.16 లక్ష్యసేన్ రెండో గేమ్‌లో కాస్త మెరుగ్గా ఆడాడు. 11-15తో ప్రతిఘటించినా రెండో గేమ్‌లో లక్ష్యసేన్ పైచేయి సాధించలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్విక శివాని 21-12, 21-19తో ఉక్రెయిన్ షట్లర్‌పై గెలుపొంది ముందంజ వేశారు.
లక్ష్యసేన్ అవుట్
- Advertisement -
- Advertisement -