Friday, September 12, 2025
E-PAPER
Homeఆటలుక్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌

క్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌

- Advertisement -

సాత్విక్‌-చిరాగ్‌ జోడీ సైతం..
హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500

హాంగ్‌కాంగ్‌ : భారత స్టార్‌ షట్లర్‌, పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనలిస్ట్‌ లక్ష్యసేన్‌ ఈ ఏడాది వరుస వైఫల్యాలకు చెక్‌ పెడుతూ హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో సహచర వెటరన్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరుపై 15-21, 21-18, 21-18తో లక్ష్యసేన్‌ మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ తొలి గేమ్‌ను కోల్పోయాడు. కానీ ఆ తర్వాత వరుస గేముల్లో సత్తా చాటాడు. మరో యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి 21-19, 12-21, 21-14తో ఐదో సీడ్‌, జపాన్‌ షట్లర్‌ కొడారు నరొకపై మెరుపు విజయం సాధించాడు. 72 నిమిషాల ఉత్కంఠ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గెలుపొంది పట్టు బిగించిన ఆయుష్‌.. నిర్ణయాత్మక మూడో సెట్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఐదో సీడ్‌ను ఓడించి పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌ విభాగంలో ఎనిమిదో సీడ్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 18-21, 21-15, 21-11తో ఇండోనేషియా జోడీపై 63 నిమిషాల మ్యాచ్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు పైచేయి సాధించారు. మెన్స్‌ సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌ 6-21, 12-21తో మూడో సీడ్‌ చైనీస్‌ తైపీ షట్లర్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ, శ్వేత పర్ణ జంట 13-21, 7-21తో ఐదో సీడ్‌ చైనా అమ్మాయిల చేతిలో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఓటమి చెందింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -