Friday, September 19, 2025
E-PAPER
Homeఖమ్మంఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి

- Advertisement -

– ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని నాయకపోడు సేవా సంఘం నాయకులు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు సోమని శివ ప్రసాద్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఆదివాసీల అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో భాగంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఈ నెల 21 తేదీ ఆదివారం సకల ఆదివాసీ సంఘాలు ఆధ్వర్యంలో చారిత్రాత్మక భారీ ర్యాలీ జరగబోతుంది అని, మన హక్కుల కోసం,మన అస్తిత్వం కోసం జరుగుతున్న ఈ మహోద్యమం లో ఆదివాసీ ఇతర తెగల తో పాటు ప్రతీ ఒక్క ఆదివాసీ నాయక పోడు బిడ్డ పాల్గొనాలి పిలుపునిచ్చారు.

మన ఐక్యతను చాటి చెప్పి,మన గళాన్ని బలంగా వినిపించాలని,అందుకోసం ఈ ర్యాలీలో ప్రతీ ఆదివాసీ పాల్గొని విజయవంతం చేయాలి కోరారు. చట్టబద్దత లేని లంబాడి నీ ఎస్టీ జాబితా నుండి తొలిగించే ఉద్యమంలో ప్రతి ఒక్క నాయకపోడు బిడ్డ ఉద్యమించాలి అని,మన బిడ్డల భవిష్యత్తు కోసం కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్ళ దుర్గయ్య,జిల్లా,మండల అధ్యక్షులు,సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -