Tuesday, November 18, 2025
E-PAPER
Homeఆదిలాబాద్లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడాలను ఎస్టి జాబితా నుంచి, ఎస్టీ సర్టిఫికెట్ తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల నవంబర్ 23,న ఉట్నూర్ లోనీ ఎంపీడీవో  గ్రౌండ్స్ లో ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్మ యుద్ధ భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో  చలో ఉట్నూర్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాయి సెంటర్ ఆధ్వర్యంలో 9 తెగల ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుండి లంబాడ సోదరులు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఆదివాసి తెగలకు అందవలసిన రిజర్వేషన్స్ విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అన్ని కూడా లంబాడ సోదరులే అనుభవిస్తూ నేడు ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.  మేము చేస్తున్న ప్రజా పోరాటం న్యాయపోరాటం రాజకీయం పోరాటలకు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధి జీవులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సహాయ సహకారాలు అందించి ఉట్నూర్ లో 23,న జరిగి ఆదివాసీల ధర్మ యుద్ధ భారీ బహిరంగ సభ కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పుసం సోనేరావ్ రాయి (సెంటర్ సర్మేడి జన్నారం), సీడం కాళీ- (తుడం దెబ్బ మండల అధ్యక్షుడు), మండాడి ననేశ్వర్ -(తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి), దుర్వ యశ్వంత్ రావు-(ఆదివాసి సేన మండల అధ్యక్షుడు), తుడసం గంగు పటేల్ (- తుడుం దెబ్బ మండల్ కోశాధికారి), ఆడాయి హన్మంత్ రావు(  రాజ్ గోoడ్ సేవా సమితి జన్నారం మండల్ అధ్యక్షులు.),
మర్సుల వసంత్(   రాజ్ గోండ్ సేవ సమితి మండల ప్రధాన కార్యదర్శి), ఆత్రం మహేష్( – ఆదివాసీ సేన జిల్లా సోషల్  మీడియా కోఆర్డినేటర్), తోటి సంఘం రాష్ర్ట కార్యదర్శి పెండోర్ రాజేష్, పర్ధన్ సంఘం కుర్సెంగా శ్రీనివాస్, కొలం సంఘం కోడోప ఆనంద్, నాయక పోడు రాయా రాజేశువర్, ఉర్వేత ధర్మ పటేల్ తుడుం దెబ్బ కార్యదర్శి సోయం కిరణ్ ఆత్రం రమేష్ ఆత్రం రాజేష్ మండది నాణేష్ఆత్రం జలింషావ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -