– మోహరించిన పోలీసులు, ముందస్తు అరెస్టులు
– రిజర్వాయర్ నిర్మాణం తప్పదు : ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – బల్మూరు
బల్మూరు ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం కోసం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన భూ సేకరణ సదస్సు ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. భూములు కోల్పోతున్న బల్మూరు రైతులతోపాటు అనంతవరం, అంబగిరి, మైలారం గ్రామ రైతులు భూ సేకరణ సదస్సును అడ్డుకుంటారన్న ఉద్దేశంతో సదస్సు ఏర్పాటుచేసిన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అచ్చంపేట రోడ్డు వైపు అంబేద్కర్ విగ్రహం నుంచి లింగాల రోడ్డు వైపు రైతులు, ప్రజలు గుమికూడకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. ప్రజలను రోడ్డుమీదికి రావద్దంటూ హెచ్చరించారు. భూ సేకరణ సదస్సును అడ్డుకుంటారని తెలిసిన 15 మంది రైతు నాయకులను ముందస్తుగానే అరెస్టు చేసి పోలీస ్‌స్టేషన్లకు తరలించారు. దాంతో ఆగ్రహించిన రైతులు.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, వారు వస్తేనే భూ సదస్సుకు వస్తామని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట బైటాయించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు.. అరెస్ట్ చేసిన వారిని తీసుకురావడంతో రైతులు ఆందోళన విరమించి భూ సేకరణ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్య క్రమంలో డీిఈఈ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ అరుణరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, గ్రామాల రైతులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం దక్కేలా పోరాడుతా : ఎమ్మెల్యే వంశీకృష్ణ, అచ్చంపేట
భూ నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి వారికి పూర్తిస్థాయిలో న్యాయం దక్కేంతవరకూ పోరాడుతా. రిజర్వాయర్ నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే పూర్తిస్థాయిలో అనుమతులు లభించాయి. కానీ అప్పుడున్న డిజైన్‌ను మారుస్తూ ప్రస్తుతం 300 ఎకరాల భూమిని తగ్గిస్తూ డిజైన్ చేశారు. దాంతో బల్మూరు గ్రామ సమీపం నుంచి 370 మీటర్ల దూరం, అదేవిధంగా అనంత వరం గ్రామం నుంచి 30 మీటర్ల దూరం రిజర్వాయ ర్‌ను కుదించారు. 2.60 టీఎంసీలు ఉన్న రిజర్వా యర్ సామర్థ్యాన్ని 2.40టీఎంసీలకు తగ్గిం చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న ఈ రిజ ర్వాయర్ కోసం.. రిలే దీక్షలు, పాదయాత్రలు కూడా చేశాను. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పో తున్న వారికి నష్టపరిహారంతోపాటు వారి కుటుంబంలో అర్హులైన వారికి ఔట్‌సౌర్సింగ్ ద్వారా ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాను.
అచ్చంపేట నియోజ కవర్గంలో పరిశ్రమల ఏర్పాటు చేయాలంటే ఎవరూ ముందుకు రారు.. అందుకే అందుబాటులో ఉన్న సాగునీటిని ప్రతి రైతు పొలానికి పారించడమే తన లక్ష్యం.
భూ సేకరణ సదస్సు ఉద్రిక్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES