Monday, November 24, 2025
E-PAPER
Homeఖమ్మంభూ వివాదం.. కత్తులు, కర్రలతో ఇరువర్గాల దాడులు

భూ వివాదం.. కత్తులు, కర్రలతో ఇరువర్గాల దాడులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వరావుపేట
ఇరు వర్గాల మధ్య నెలకొన్న భూ వివాదంలో సోమవారం పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒక వర్గీయులు కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇరువురికి స్వల్ప గాయాలైయ్యాయి.  ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురి పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడెం కాలనీ కి చెందిన మంగా గణేష్,మంగా వెంకటేష్ మణికంఠ,గోవింద్ లకు అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణుమూర్తి,గేదెల సురేష్,వినయ్ మధ్య గత కొద్ది నెలలు గా సర్వే నంబరు 1228 లో ఉన్న 75 సెంట్ల వ్యవసాయ పొలం విషయంలో వివాదం ఉంది. ప్రస్తుతం ఈ పొలంలో మంగా గణేష్ కుటుంబీకులు అరటి సాగు చేస్తుండగా,10 రోజుల క్రితం అరటి చెట్లను నరికి వేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు గేదెల విష్ణుమూర్తి కుటుంబీకుల పై కేసు నమోదు అయింది. 

ఈ క్రమంలోనే తాజాగా సోమవారం మరోసారి భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఈ పొలం తమదేనని గేదెల విష్ణుమూర్తి తనయుడు గేదెల సురేష్, మనవడు వినయ్ కలిసి కర్రలు,కత్తులతో మంగా గణేష్,మంగ వెంకటేష్ లు పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వారిద్దరి తల,శరీరం పై తీవ్రగాయాలు కాగా, ఇదే దాడిలో మరో ఇద్దరు మంగా మణికంఠ, గోవింద్ స్వల్పంగా గాయపడ్డారు.దీంతో అక్కడే ఉన్న స్థానికులు బాధితులను అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కి తరలించారు.  వీరిలో మంగా గణేష్, మంగా వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రి కి తరలించారు.  ఈ ఘటనపై బాధితుడి మంగా మణికంఠ చేసిన రాత పూర్వక ఫిర్యాదుతో కత్తులు,కర్రలతో దాడికి పాల్పడిన గేదెల విష్ణుమూర్తి, గేదెల సురేష్, గేదెల వినయ్ లు పై హత్యాయత్నాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -