Friday, July 18, 2025
E-PAPER
Homeజాతీయంల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌

- Advertisement -

సుప్రీం కోర్టుకు లాలూ ప్రసాద్‌
న్యూఢిల్లీ :
ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి ట్రయల్‌ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆర్‌జెడి నాయకులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, జస్టిస్‌ ఎన్‌ కోటిశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం ఈ నెల 18న విచారించే అవకాశం ఉంది. ట్రయల్‌ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్‌ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరిం చింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది.
2004 నుంచి 2009 వరకూ లాలూ ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్‌ జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెస్ట్‌ సెంట్రల్‌ జోన్‌లో గ్రూప్‌ డి నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సిబిఐ ఆరోపిస్తోంది. 2022 మే 18న ఈ కేసు నమోదయింది. అయితే ఈ కేసును ప్రతీకార రాజకీ యాలుగా లాలూ విమర్శిస్తు న్నారు. స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్న సమయం తరువాత దాదాపు 14 ఏండ్ల తరువాత ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -