నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
భూ కబ్జాదారులకు ప్రభుత్వ స్థలం అని తెలిసి, ప్రభుత్వ స్థలాన్ని అమాయక ప్రజలకు అంటగట్టి డబ్బులు పోగేసుకుంటున్నారు. దీంతో అమాయక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేవని ఇబ్బందులు మళ్లీ ఈ భూకబ్జాదారులతో ఎటువంటి సమస్యలు ఏర్పడతాయని అమాయక ప్రజల ఆవేదన చెందుతున్నారు. పట్టా కాగితాలను ఇచ్చి డబ్బులను కాచేస్తున్న భూ కబ్జాదారులు దుబ్బా ప్రాంతంలో గల ప్రభుత్వ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ముందు ప్రభుత్వ స్థలాన్ని , సర్వే నంబర్ 168 , ఆ ప్రాంతవాసులకు గార్డెన్ కు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాన్ని ప్రభుత్వం వదిలివేశారు. ఆ స్థలాన్ని కొందరు రాజకీయ నాయకులము అని చెప్పుకొని, భూకబ్జాదారులుగా మరి 37 మందికి పట్టాలను ఇవ్వడం జరిగింది.
ఆ పట్టాలన్నియు ప్రభుత్వం నుంచి ఆమోదితం పొందినవి కావు, వారికి వారుగా తయారుచేసిన పట్టాలను అమాయకులకు ఇవ్వడం జరిగింది, ఆ పట్టా పేపర్ల ను భూ కబ్జాదారులే తయారు చేసి, ఆ పట్టా ల పైన ఫోటోలను అతికించి, స్టాంపులను వారే తయారు చేసి, అధికారుల సంతకాలను చేసి కొందరి అమాయక ప్రజలకు పట్టా కాగితాలను అంటగట్టారు. ఆ పట్టా కాగితాలను కొనుగోలు చేసిన వారికి సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పుడు స్థలం చూపిస్తాం, అప్పుడు స్థలం చూపిస్తాం అంటే సమయాన్ని వెల్లదీస్తున్నారు. సమయాన్ని వెల్లదీయడమే కాకుండా మళ్లీ ఎప్పుడు గుర్తు చేసిన ఇంకా డబ్బులు కావాలి అని, డబ్బులు ఇస్తేనే అవి చెల్లుబొట్టు అయ్యే విధంగా చూస్తామని, అమాయక ప్రజలను మోసగిస్తున్నారు.
అంతేకాకుండా ఆ స్థలాన్ని ఎవరికి స్థలాలు చూపించడంలేదు అని, మున్సిపాలిటీ నుండి ఇటువంటి అనుమతి పొందలేదు, ఆ స్థలం కు సంబంధించిన పాట్టాలను కొనుగోలు చేసిన పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతాయు చేసిన ఎవరు ప్రశ్నించినా, ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని సాకులు చెబుతూ సంవత్సరాల కొలది సమయాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం గుర్తించి దానికి హద్దులు ఏర్పాటు చేసి , ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించి ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా చూడాలని కాలని వాసులు కోరుతున్నారు.
ప్రభుత్వ స్థలానికి పట్టా కాగితాలు సృష్టించిన భూకబ్జాదారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES