జిల్లా అదనపు కలెక్టర్లతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్
నవతెలంగాణ- వనపర్తి
రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)లతో భూ సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాదా బైనామా, భూ భారతీ ద్వారా వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 60 రోజుల వ్యవధి దాటిన భూభారతి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ వివరిస్తూ వనపర్తి జిల్లాలో రెవెన్యూ సదస్సు ద్వారా 4110 దరఖాస్తులు వచ్చాయని ఇందులో 30,672 ఎకరాలు కవరేజీ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 5863 ఎకరాలు అప్డేట్ చేసినట్లు చెప్పారు. సాదా బైనామా 8120 వచ్చాయని ఇందులో ఆర్డీఓ లాగిన్ ద్వారా 353 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయని వాటిని తహసిల్దార్ లాగిన్ నుండి ఆర్డీఓ లాగిన్ కు త్వరగా పంపే విధంగా ఆదేశాలు ఇస్తామన్నారు. భూభారతి దరఖాస్తులు 1938 వచ్చాయని, 15 రోజుల వ్యవధి దాటిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఏ డి బాలకృష్ణ, సెక్షన్ సూపరింటెండెంట్ లు, ఎ. ఒ భాను ప్రకాష్ తదితరులు వి.సి.లో పాల్గొన్నారు.



