Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరా మహిళా శక్తి భవనం కోసం స్థలం అందజేత

ఇందిరా మహిళా శక్తి భవనం కోసం స్థలం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ లో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం కోసం కావలసిన స్థలాన్ని మంగళవారం స్థానికులు అధికారులకు అందజేశారు. మహిళా సమాఖ్య ద్వారా మంజూరైన పది లక్షల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మించనున్నారు.ఈ నేపథ్యంలో ఉచితంగా ప్రైవేటు స్థలాన్ని సమకూర్చడంలో సహకరించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి లను మహిళా సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి,ఏపిఎం గంగారాం,సమాఖ్య సీసీ జోష్నా, సిఏ లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -