Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్700 సర్వే నెంబర్ పట్టాల లబ్ధిదారులకు స్థలం చూపించాలి

700 సర్వే నెంబర్ పట్టాల లబ్ధిదారులకు స్థలం చూపించాలి

- Advertisement -

సీపీఐ(ఎం)  పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
: భువనగిరి పట్టణం ముద్దుంపల్లి రోడ్డు ప్రక్కన సర్వేనెంబర్ 700లో 105 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చి 20 సంవత్సరాలు అవుతున్న నేటికీ స్థలము కేటాయించలేదని వెంటనే వారికి స్థలం కేటాయించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశం కార్యవర్గ సభ్యురాలు కల్లూరు నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానం చేసి 18 నెలలు దాటినా.. నేటికీ అమలు చేయకుండా వాగ్దానాల విస్మరించారు. ఇంటి జాగా లేనివారికి ప్రభుత్వ భూమిలో ఐదు లక్షలు తో ఇల్లు కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. గతంలో పట్టాలి ఇచ్చిన వారికి అదే స్థలములో ఒకే దగ్గర ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వ ప్లాన్ ప్రకారం ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తానని అంటున్నారు. అది 50 గజాలలోనే కానీ ఉన్న పెంకటిల్లు రేకుల ఇల్లు తీసివేసి ఎన్నో ఆశలతో ఐదు లక్షలతో ఇల్లు వస్తదని ఉన్న ఇల్లును కూల్చివేశారు.

వారి సొంత స్థలంలో వారి నక్ష ప్రకారము రూ.5 లక్షలు సహకారం చేస్తూ మరికొంత యజమాని పెట్టుబడి పెట్టుకునే వారికి అవకాశం కల్పించాలని సీపీఐ(ఎం)  డిమాండ్  చేసింది. ప్రతి ఇంటి మహిళలకు రూ. 2500 ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఆసరా పెన్షన్ రూ. 2000 నుంచి రూ రూ.4000 వరకు వికలాంగులకు రూ. 3000 నుంచి రూ. 6000 వరకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అంగవైకల్యం ఉన్న పెన్షన్ వస్తున్న వారు మరణిస్తే భార్యకు రావడం లేదన్నారు. అది వెంటనే అమలు చేయాలన్నారు. మూడు నెలల బియ్యము ఒకేసారి రేషన్ ఇవ్వడం వలన రేషన్ కార్డులో కొత్తగా పేర్లు నమోదు అయినా వారికి ఈ బియ్యము వర్తించడం లేదన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారి పేర్లను అమ్మగారి ఇంటి వద్ద పేరు తీసి వేసిన తర్వాతనే రేషన్ కార్డులో కొత్తగాపేరు నమోదు కావడం లేదు అన్నారు. పేరు తొలగించిన వెంటనే కొత్త పేర్లు నమోదు చేయాలన్నారు. రేషన్ రావడంలేదని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  మీసేవ చుట్టూ తిరుగుతూ కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మీ సేవలో వస్తున్న సమస్యను కలెక్టర్ పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య పట్టణ నాయకులు బర్ల వెంకటేష్, వల్దాస్ అంజయ్య, దాసరి మంజుల పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad