Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ నిర్వాసితులకు జెన్కో కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి

భూ నిర్వాసితులకు జెన్కో కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు  : బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు భూములు కోల్పోయిన రైతులకు ఒప్పందం ప్రకారం కుటుంబ సభ్యులలో ఒకరికి జెన్కో కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పించాలని తాడిచెర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వశిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి, ప్రధాన కార్యదర్శి తాండ్ర సంతోష్ ,జెన్కో సిఈ ప్రకాష్ సోమవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు రైతులకు జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోవడంతో ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.భూసేకరణ సమయంలో తాడిచర్ల గ్రామ రైతు కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం అవకాశాన్ని కల్పిస్తామని అప్పటి జెన్కో అధికారులు హామీ ఇచ్చారని దానిని ఇప్పుడు నెరవేర్చాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -