– భూ భారతిలో ఎక్కని భూమి 701 ఎకరాలు
– సీఎస్ రామకృష్ణారావుకు రైతు కమిషన్ నివేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాల భూములను రక్షించాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల 1629 ఎకరాల్లో సీడ్ ఫార్మ్ ద్వారా వివిధ రకాల విత్తనోత్పత్తి జరిగేదనీ, కొన్నేండ్లుగా ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తన నివేదికలో ఎత్తిచూపింది. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, గోపాల్‌రెడ్డి, తదితరులు విత్తనోత్పత్తి క్షేత్రాల భూములపై నివేదిక అందజేశారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సమయంలో మాల్తుమ్మెదలో 700 ఎకరాలకుపైగా వున్న సీడ్ ఫార్మ్ అన్యాక్రాంతం అయ్యే స్థితిలో ఉందని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని కోదండరెడ్డి వివరించారు. సీడ్ ఫార్మ్‌పై ఈనెల 10న కమిషన్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించగా మిగతా చోట్ల కూడా విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు ఆగమవుతున్నట్టు గుర్తించామని తెలిపారు. భూ భారతిలో కొన్ని చోట్ల భూములు ఎక్కని విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడాలని కోరారు. ఏ లక్ష్యం కోసం భూములు కేటాయించారో దాని కోసం ప్రభుత్వాలు పనిచేసేలా చూడాలని విన్నవించారు.
విత్తనోత్పత్తి క్షేత్రాల భూములను కాపాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



