Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంచైనాలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు..

చైనాలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చైనాలోని తూర్పు ప్రావిన్సు షాన్‌డాంగ్‌లోని ఒక రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని, ఆకాశంలో వందల అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి.

షాన్‌డాంగ్‌ ప్రావిన్సు పరిధిలోని వీఫాంగ్‌ నగర శివార్లలో ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్కులోని షాన్‌డాంగ్‌ యుడావో కెమికల్ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా, చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. సుమారు 232 మంది అగ్నిమాపక సిబ్బందిని, పలు ప్రత్యేక రెస్క్యూ బృందాలను, వైద్య నిపుణులను ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad