Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమం 

రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమం 

- Advertisement -

– బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్  పాపట్ల  నరహరి
పాతగుట్ట రోడ్డు బాధితులకు మద్దతుగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

యాదగిరిగుట్ట పట్టణం పాతగుట్ట రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బిఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు  కర్రె వెంకటయ్య, పట్టణ పార్టీ సెక్రటరీ జనరల్  పాపట్ల  నరహరి లు అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట పాత గుట్ట రోడ్డు బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతుగా  పట్టణంలోని పాత గుట్ట చౌరస్తా వద్ద బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రోడ్డు బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పునర్నిర్మాణం జరిగిన సమయంలో రోడ్లు ఇండ్లు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారాన్ని అందించిన తర్వాతనే పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించిందని అన్నారు.

అదే తరహాలో ప్రస్తుతం పాత గుట్ట రోడ్డు బాధితులకు కూడా తగిన నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందించాలని అన్నారు. పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపరిహారంతోపాటు ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు,  ప్లాట్లు కోల్పోయిన వారికి ప్లాట్లు అందించడంతోపాటు వై టి డి ఏ పరిధిలో వారికి దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు బాధితుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అధికారులు రోడ్డు బాధితుల వాదన వినకుండా ముందుకెళ్లడం సరి అయింది కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు పాత గుట్ట రోడ్డు బాధితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సుమారు రెండు గంటలకు పైగా పాతగుట్ట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది దీంతో పోలీసులు అక్కడ చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు.  అనంతరం వారిని రాస్తారోకో విరమింపజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నాయకులు ఆరె శ్రీధర్ గౌడ్, పేరబోయిన సత్యనారాయణ యాదవ్, గడ్డం చంద్రం, కల్వకులను సతీష్ బట్, కొన్యాల నరసింహారెడ్డి, గంజి సూర్యనారాయణ, దండబోయిన వీరేష్ యాదవ్,  ముక్కెర్ల శ్రీశైలం, గాదపాక క్రాంతి, పాండురాజు, ఉప్పలయ్య, భక్త కన్నప్ప, బుడిగే సత్తయ్య, పబ్బాల సాయి, చిరంజీవి, బర్ల శివయ్య, ఎస్.కె నజీర్, కన్న రాజు, గడ్డమీది రాజాలు, బండ రామస్వామి సర్దార్, ఆకుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -