హైదరాబాద్ : నగరానికి చెందిన డీప్‌టెక్ సంస్థ అయిన సింప్లిఫోర్జ్ ఐఐటి హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద మిలిటరీ ఇన్సిగ్నియా ప్రవేశ ద్వారాన్ని(ఆర్చ్) అభివృద్ధి చేసినట్లు సింప్లిఫోర్జ్ తెలిపింది. దీని కొలతలు 5.7 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వెడల్పు, 5.4 మీటర్ల ఎత్తు ఉన్నాయి. సింప్లిఫోర్జ్ కంపెనీకి చెందిన అత్యాధునిక రోబోటిక్ ఆర్మ్ ఆధారిత 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో దీన్ని నిర్మించినట్లు పేర్కొంది. పులి బొమ్మతో (టైగర్ థీమ్) ఉన్న ఈ ప్రవేశ ద్వారం కంటో న్మెంట్ లోపల ఉండే ఇండోర్ స్పోర్ట్స్ అరేనాలోకి దారి తీస్తుందని తెలిపింది. దీని నిర్మాణం, డిజైన్ అభివృద్ధిని ఐఐటి హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ కె.వి.ఎల్.సుబ్రమణియం, సింప్లిఫోర్జ్ కంపెనీ భాగస్వామ్యంతో చేపట్టారు. సింప్లిఫోర్జ్ ఫౌండర్ ఫైజాన్ చౌదరి ప్రాజెక్టు భాగస్వామిగా వ్యవహారించారు.



