Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeసోపతి'తరువాత' ఒక మాయాలోకం

‘తరువాత’ ఒక మాయాలోకం

- Advertisement -


రఘుకి తల్లిదండ్రులు, స్నేహితులు, తనను నిజంగా ప్రేమించే అనేక మంది ఉండేవారు. కానీ అతనికి ఒక అలవాటు .. ప్రతి విషయాన్నీ ‘తరువాత’కి వాయిదా వేయడం. ‘అమ్మతో మాట్లాడాలనుంది కానీ తర్వాత’. ‘నాన్నని హత్తుకోవాలనిపిస్తుంది, కానీ తర్వాత…’
‘ఫ్రెండ్‌కి ఫోన్‌ చేయాలనిపించింది, కానీ బిజీగా ఉన్నాను. తరువాత.’

ఈ ‘తరువాత’ మాట అతనికి ఓ డబ్బా లాంటిది. అందులో అన్ని భావాలను మూసేసి పెట్టేవాడు. కానీ ఓ రోజు ఆ డబ్బా ఓపెన్‌ చేసుకున్నప్పుడు, దాన్లో ఖాళీ తప్ప ఇంకేమీ లేదు. అమ్మ పోయింది. నాన్న మాట తీరిపొయింది. ఫ్రెండ్‌ కొత్త జీవితంలోకి వెళ్లిపోయాడు. ‘తరువాత’ అన్న ప్రతిసారీ జీవితాన్ని ఒక మెట్టు వెనక్కి నడిపాడు. ఇప్పుడు అతనికి మిగిలిందేమిటంటే… బాధ, ఒంటరితనంతో నిండిన మౌనం.
మానసిక ప్రపంచాన్ని తాకే మౌన రోదన
సహజ అనే పద్నాలుగేళ్ల అమ్మాయి తన తల్లికి రోజూ ఒకే మాట చెప్పేది… ”అమ్మా, నీతో మాట్లాడాలని ఉంది, కానీ తర్వాత చెప్తా.”
అమ్మ చిన్న చిన్న విషయాల్లో ఎదైనా అడిగితే, ”ఇప్పుడు టైమ్‌ లేదమ్మా, రేపు కూచుని మాట్లాడుకుందాం” అంది. ఆ తర్వాత… రేపు రాలేదు. ఆ తల్లి వెళ్ళిపోయింది శాశ్వతంగా. తరువాత చెబుతానన్న అన్ని మాటలు ఆమె ఊపిరిలోనే మిగిలిపోయాయి.
ఇప్పుడు సహజ జీవితంలో ఉన్న మాటలు ఒకే పదం ‘అప్పుడే చెప్పుకోవాల్సింది’
డిప్రెషన్‌తో నా దగ్గరకు వచ్చిన కేసులివి. కానీ ఎంతమంది ఇలా తరువాత తరువాత అంటూ..
1.Procrastination- వాయిదా అనేది మన మానసిక రక్షణ వ్యవస్థలో భాగం. మనకు ఇబ్బంది కలిగించే పనులనో, భావోద్వేగాలని ఎదుర్కొలేని పరిస్థితులనో ‘తరువాత’కి వదిలేస్తాం. కానీ దీని వెనుక ఉన్నది…
8 భయం (fear of conflict or rejection)
8 అవసరం గుర్తించలేకపోవడం (lack of emotional awareness)
2. (lack of emotional awareness)Emotional avoidance leads to regret – జీవితంలో ముఖ్యమైన సంబంధాలను మిస్సవడానికి కారణం మనం వాటిని తరువాత అనడమే.
‘ఇప్పుడు మాట్లాడితే ఎమోషనల్‌ అవుతాను’
‘ఇప్పుడు చెబితే ఎదుటివాడు ఎలా స్పందిస్తాడో అని భయం’
‘ఇప్పుడు తప్పించి తర్వాత చూసుకుందాం అనుకునే అలవాటు’
మానవ సంబంధాలు – వాటికి సమయం, అటెన్షన్‌, సంభాషణ అవసరం. వాటిని వాయిదా వేస్తే, అవి అంతరించిపోతాయి.
3. ఒక మానసిక తప్పిదం. మనిషి సుఖాన్ని, ప్రేమను, బాధను, బాధ్యతను కూడా ‘తరువాత’ అన్న మాటతో తప్పించుకుంటాడు. అది అసలు బహిరంగంగా ఒప్పుకోని మానసిక వ్యాధిలా ఉంటుంది. అయితే… ఈ తరువాత అనే భ్రమకు ఒక expiry date ఉంటుంది.
జీవితంలో ప్రతి సంబంధానికి expiry ఉంటుంది. ప్రతి మనిషికి ఓ చివరి రోజు ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం… ‘ఇంకా టైమ్‌ ఉందిగా’ అని.
4. . Mindfulness- ‘ఇప్పుడు’ జీవించడమే నిజమైన ఆరోగ్యకరమైన జీవితం.
మనసు గతం, భవిష్యత్తులో తిరిగే చక్రంలా ఉంటుంది. కానీ ఇప్పుడు అనేది మన చేతుల్లో ఉన్న ఏకైక నిజం.
‘ఇప్పుడు’ అనే మందు…
8 స్నేహితుడికి కాల్‌ చేయాలనిపిస్తే ఇప్పుడే చేయండి.
8 ప్రేమను వ్యక్తపరచాలనిపిస్తే ఇప్పుడే చెప్పండి.
8 మంచి మాటలు పలికాలనిపిస్తే వెంటనే పలకండి.
8 ఎవరి మాటైనా వినాలి అనిపిస్తే, ఇప్పుడే వినండి
8ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అనిపిస్తే, వెంటనే చెప్పండి
8 ఇదిmotivational గాథ కాదు. ఇది మనసు నిత్యం ఎదుర్కొనే నిజం.
8 తరువాత అనే మాటలో మౌనం ఉంటుంది. ఇప్పుడు అనే మాటలో జీవం ఉంటుంది.
8 ఇప్పుడే చెప్పడమే మనిషి మనస్సుకు healthiest decisionఅవుతుంది.
8 ‘తరువాత’ అనకుండా ప్రస్తుతమే
ఎందుకంటే… జీవితం మన కోసం ఆగదు, మనం ఆగినా. అందుకే.. ఇప్పుడు నవ్వండి, ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు జీవించండి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad