- Advertisement -
- – వివాహాలకు వేడుకలకు హాజరు…
నవతెలంగాణ – అశ్వారావుపేట - నియోజక వర్గం అయిన అశ్వారావుపేట మండలంలో తాజా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు,తాటి వెంకటేశ్వర్లు మంగళవారం పర్యటించి వివాహాలకు, వేడుకలకు హాజరయ్యారు. మండలంలోని పండువారిగూడెంలో జరిగిన పెన్మత్స సత్యనారాయణ(బాబు) – కల్పన దంపతుల కుమారుడు శశాంక్ వర్మ వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు,తాటి వెంకటేశ్వర్లు నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
- వేదాంత పురం లో శ్రీశ్రీశ్రీ చిన్న కొర్రాజుల స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారి మెచ్చా గారిని శాలువాతో సత్కరించారు. ఇదే గ్రామంలో ఊకె ఎర్రప్ప కుమారుడి వివాహం ఇటీవలే జరగగా మంగళవారం ఆ నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
- ఉట్లపల్లి లో తెల్లం ముత్యాలు – కన్నమ్మ దంపతుల మనవరాలి నూతన వస్త్ర అలంకరణ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,
- బీఆర్ఎస్ నాయకులు మందపాటి రాజ్ మోహాన్ రెడ్డి జెడ్పీటీసీ మాజీ సభ్యులు అంకత మల్లికార్జున రావు,ఆసుపాక మాజీ సర్పంచ్ పొట్ట రాజులు తదితరులు పాల్గొన్నారు.
- ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -